Skip to main content

BODY SWAP WITH NEIGHBOR

 నా పేరు సుశాంత్. నేను ఒక డాక్టర్‌ని. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం నా డాక్టర్ జీవితానికి సంబంధించినది కాదు. నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక విచిత్రమైన సంఘటన గురించి.

నేను పుట్టినప్పటి నుండి అనాథనే. నాకు అమ్మానాన్న ఎవరో తెలియదు. నా బాల్యం మొత్తం ఒక అనాథాశ్రమంలోనే గడిచింది. అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను, అక్కడే జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నాను.

చిన్నప్పుడు ప్రతి ఆదివారం నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు పిల్లలను దత్తత తీసుకోవడానికి చాలామంది వచ్చేవారు. గేట్ దగ్గర కారు ఆగగానే మేమందరం ఆశగా పరుగెత్తుకుంటూ వెళ్లేవాళ్లం. "ఈసారి నన్ను తీసుకెళ్తారేమో" అనే ఆశ నా మనసులో కూడా ఉండేది.

ఒకసారి ఒక దంపతులు వచ్చారు. వాళ్లు నాతో చాలాసేపు మాట్లాడారు. నా పేరు అడిగారు. నేను ఏమి చదువుతున్నానో అడిగారు. నాకు ఏమి ఇష్టమో అడిగారు. ఆ ఆంటీ నా తల నిమిరి నవ్వింది. ఆ క్షణంలో నాకు నిజంగానే ఆశ కలిగింది. బహుశా ఈసారి నాకూ ఒక కుటుంబం దొరకబోతోందేమో అనుకున్నాను.

కానీ కొద్దిసేపటి తరువాత వాళ్లు నా పక్కన ఉన్న ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుని వెళ్లిపోయారు.

వాళ్ల కారు గేట్ దాటి వెళ్లిపోయే వరకు నేను నవ్వుతూనే ఉన్నాను. కానీ వాళ్లు కనిపించకుండా పోయాక ఒంటరిగా కూర్చుని చాలా సేపు ఏడ్చాను. ఆ రోజు మొదటిసారి ఒక విషయం గమనించాను. చాలామంది అమ్మాయిలనే దత్తత తీసుకుంటున్నారు.

అప్పుడు నా చిన్న మనసులో ఒక ఆలోచన పుట్టింది.

"నేను కూడా అమ్మాయిగా పుట్టి ఉంటే...?"

ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు. కానీ ఆ ఆలోచన మాత్రం నాలోనే ఉండిపోయింది.

కాలం గడిచేకొద్దీ నాకు అమ్మాయిల దుస్తులు, పొడవాటి జడలు, మల్లెపూలు అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. పండుగ రోజుల్లో హోమ్‌కి వచ్చే అమ్మాయిలను చూస్తూ ఉండిపోయేవాడిని. వాళ్ల జడలు, వాళ్ల అలంకరణ, వాళ్ల నవ్వులు అన్నీ నాకు చాలా నచ్చేవి.

ఒకసారి ఎవరూ లేని సమయంలో ఒక పాత చున్నీ దొరికింది. దాన్ని భుజాల మీద వేసుకుని అద్దం ముందు నిలబడ్డాను. ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కానీ అది ఎక్కువసేపు నిలవలేదు. వార్డెన్ నన్ను చూసి చాలా కోపపడింది. ఆ రోజు తరువాత అలాంటి పనులు బయటకు చేయలేదు. కానీ నా మనసులోని కోరిక మాత్రం ఎప్పుడూ చనిపోలేదు.

అలా రోజులు గడిచాయి. నేను చదువులో బాగా రాణించాను. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత NEET పరీక్ష రాశాను. మంచి ర్యాంక్ రావడంతో చెన్నైలోని ఒక మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. అనాథాశ్రమాన్ని వదిలి వెళ్లే రోజు కొంచెం బాధగా అనిపించినా, మరోవైపు నాకు ఒక స్వేచ్ఛ దొరికినట్టుగా అనిపించింది.

కాలేజీలో మొదటి సంవత్సరం హాస్టల్‌లో ఉన్నాను. రెండో సంవత్సరం నుండి బయట ఒక చిన్న ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాను. స్కాలర్‌షిప్ డబ్బుతో పాటు ట్యూషన్లు చెప్పి నా ఖర్చులు చూసుకునేవాడిని. అప్పుడప్పుడు నాకు నచ్చిన కొన్ని మహిళల దుస్తులు కూడా కొనేవాడిని. వాటిని ఎవరూ చూడకుండా దాచిపెట్టేవాడిని.

ఒక ఆదివారం మధ్యాహ్నం, మొదటిసారి నేను కొన్న ఒక చుడీదార్ వేసుకుని అద్దం ముందు నిలబడ్డాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయం కూడా ఉంది. కానీ అదే సమయంలో ఒక విచిత్రమైన ఆనందం కూడా ఉంది. అద్దంలో నన్ను నేను చూస్తూ చాలా సేపు గడిపాను. చిన్నప్పటి నుండి మనసులో దాచుకున్న కోరికలో కొంత భాగం నెరవేరినట్టుగా అనిపించింది.

అలా జీవితం నెమ్మదిగా సాగుతుండగా ఒకరోజు నా జీవితాన్ని మార్చేసే వ్యక్తి నా ఎదురింటికి వచ్చింది.

ఆ రోజు సాయంత్రం ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తుంటే మా అపార్ట్‌మెంట్ ముందు ఒక టెంపో ఆగింది. అందులో నుండి ఒక దంపతులు దిగారు. వాళ్లు తమ ఫ్లాట్ ఎక్కడ ఉందో అడిగారు. అది నా ఎదురుగా ఉన్న ఫ్లాట్ అని తెలిసి నేను వాళ్లకు సహాయం చేశాను.

అప్పుడు మొదటిసారి ఆమెను చూశాను.

ఆమె పేరు శ్రావ్య.

పొడవాటి జడ.

జడ నిండా మల్లెపూలు.

సంప్రదాయంగా కట్టుకున్న చీర.

మెడలో మంగళసూత్రం.

కాలికి మెట్టెలు.

ఆమెను చూసిన క్షణంలోనే నా చూపు ఆమె మీదే నిలిచిపోయింది.

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పదేపదే ఆమె రూపమే గుర్తుకు వస్తోంది. ఎందుకో తెలియదు కానీ నేను నన్ను ఆమె స్థానంలో ఊహించుకోవడం మొదలుపెట్టాను.

మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే శ్రావ్య.

"ఈరోజు మా గృహప్రవేశం. మీరు తప్పకుండా రావాలి."

అని నవ్వుతూ చెప్పింది.

ఆమె భర్త పేరు విక్రమ్. ఒక ఇంజనీర్. శ్రావ్య మాత్రం హౌస్‌వైఫ్. ఆ రోజు వాళ్ల ఇంట్లో చాలా సమయం గడిపాను. చిన్నప్పటి నుండి కుటుంబ ప్రేమకు దూరమైన నాకు వాళ్లతో ఉండటం చాలా సంతోషంగా అనిపించింది.

కొద్ది రోజుల్లోనే మేము మంచి స్నేహితులమయ్యాము.

ఒకరోజు విక్రమ్ ఇంట్లో లేని సమయంలో నేను శ్రావ్యతో మాట్లాడుతున్నాను. అప్పుడు ఆమె తన జీవిత కథ చెప్పింది. చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని కలలు కనేదట. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయిందట.

ఆమె కళ్లలో కనిపించిన బాధ నాకు అర్థమైంది.

ఆ రోజు నుండి ఆమె నాతో మెడికల్ పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టింది.

అయితే అప్పుడప్పుడూ ఆమె గురించి నాకు కొన్ని విచిత్రమైన విషయాలు కనిపించేవి.

ఒకసారి ఆమె గదిలో ఒక పాత అల్మారా తెరిచి ఉండగా కొన్ని విచిత్రమైన పుస్తకాలు కనిపించాయి. వాటి మీద నాకు అర్థం కాని గుర్తులు ఉన్నాయి. నేను అడగబోతే వెంటనే అల్మారా మూసేసి విషయం మార్చేసింది.

అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఆ సంఘటన తరువాత ఆమె గురించి నాకు కొంచెం ఆసక్తి పెరిగింది.

కాలం గడిచింది.

నేను ఫైనల్ ఇయర్‌కు చేరుకున్నాను.

ఒకరోజు కాలేజీ ఫంక్షన్‌లో అనుకోకుండా నాకు ఒక హౌస్‌వైఫ్ పాత్ర వచ్చింది. బయటకు ఇష్టం లేనట్టు నటించినా, లోపల మాత్రం చిన్నప్పటి నుండి ఉన్న కోరిక నెరవేరబోతుందనే ఆనందం.

ఈ విషయం శ్రావ్యకు చెప్పాను.

ఆమె వెంటనే సహాయం చేయడానికి ఒప్పుకుంది.

ఫంక్షన్‌కు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి వెళ్లాను.

శ్రావ్య తన చీరల్లో ఒకటి తీసుకొచ్చింది.

"ఇది నీకు బాగా సెట్ అవుతుంది."

అని చెప్పింది.

ఆమె చెప్పినట్టే ఆశ్చర్యకరంగా ఆ చీర నాకు అచ్చం సరిపోయింది.

ఆమె నాకు చీర కట్టింది. జడ వేసింది. మల్లెపూలు పెట్టింది. చిన్న బొట్టు పెట్టింది.

కొన్ని క్షణాల తరువాత అద్దంలో నన్ను నేను చూసుకున్నాను.

నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.

చిన్నప్పటి నుండి నా ఊహల్లో మాత్రమే చూసుకున్న రూపం ఇప్పుడు నా ఎదుట కనిపిస్తోంది.

ఆ క్షణంలో నాకు మాటలు రాలేదు.

శ్రావ్య మాత్రం నన్ను చూసి నవ్వుతోంది.

"చాలా బాగున్నావు."

అంది.

అంతలో ఆమె ఒక పాత పుస్తకం తీసుకొచ్చింది.

ఆ పుస్తకం చూసిన వెంటనే నాకు అసౌకర్యంగా అనిపించింది.

"ఇది ఏమిటి?" అని అడిగాను.

"కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది."

అని నవ్వింది.

ఆమె ఆ పుస్తకం తెరిచి ఏదో తెలియని భాషలో చదవడం ప్రారంభించింది.

మొదట నేను సరదాగా తీసుకున్నాను.

కానీ కొద్దిసేపటికే గదిలోని వాతావరణం మారిపోయింది.

తెల్లటి పొగ గది అంతా వ్యాపించడం ప్రారంభమైంది.

నేను కంగారుపడ్డాను.

లేవాలని ప్రయత్నించాను.

కానీ నా శరీరం కదలడం లేదు.

చేతులు, కాళ్లు బరువుగా మారిపోయాయి.

తల తిరుగుతోంది.

గుండె వేగంగా కొట్టుకుంటోంది.

"శ్రావ్య... ఇది ఏమిటి?"

అని భయంతో అడిగాను.

ఆమె మాత్రం నిశ్శబ్దంగా నన్నే చూస్తోంది.

ఆమె కళ్లలో ఒక విచిత్రమైన చిరునవ్వు కనిపించింది.

ఆ తర్వాత నా కళ్ల ముందు అన్నీ మసకబారిపోయాయి.

నాకు స్పృహ తప్పిపోయింది.

---

సుమారు గంట తరువాత...

మెల్లగా కళ్ళు తెరిచాను.

తల చాలా భారంగా ఉంది.

నేను ఎక్కడున్నానో కూడా అర్థం కాలేదు.

ఎదురుగా ఉన్న అద్దంలో అనుకోకుండా నా చూపు పడింది.

ఆ క్షణంలో నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.

అద్దంలో కనిపిస్తున్న ముఖం నాది కాదు...

ఆ శరీరం నాది కాదు...

కానీ ఆ కళ్ల వెనుక ఉన్న వ్యక్తి మాత్రం నేనే.

"ఇది... ఎలా సాధ్యం?"

అని వణుకుతున్న స్వరంతో అనుకున్నాను.

అసలు ఏమి జరిగింది?

శ్రావ్య ఎక్కడ ఉంది?

నా శరీరానికి ఏమైంది?

ఆ నల్లటి దట్టమైన పొగను పీల్చగానే నా శరీరంలో ఏదో విచిత్రమైన మార్పులు రావడం మొదలైంది. కళ్లు బైర్లు కమ్మాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నేను స్పృహ కోల్పోయాను.

సుమారు గంట తర్వాత నెమ్మదిగా కళ్లు తెరిచాను. తల భారంగా అనిపించింది. నేను కాలేజీ డ్రామా కోసం చీర కట్టుకున్నాను కదా అనే ఆలోచనతో మెల్లగా లేచి నిలబడ్డాను. గదిలో శ్రావ్య అటువైపు తిరిగి నిలబడి ఉంది.

ఇంతలో నా వెనుక నుండి ఎవరో వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు.

నేను ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాను. వెనక్కి తిరిగి చూడగానే నా గుండె ఆగినంత పనైంది. అక్కడ నిలబడింది విక్రమ్!

నాకు మైండ్ బ్లాక్ అయింది. విక్రమ్ నన్ను ఎందుకు ఇలా కౌగిలించుకున్నాడు? పక్కనే తన భార్య ఉంది కదా! బహుశా నేను శ్రావ్య చీర కట్టుకుని ఉండటం వల్ల వెనుక నుండి చూసి పొరబడ్డాడా? కానీ, ఆ క్షణంలో అతని కౌగిలింత నాకు తెలియని ఒక వింత అనుభూతిని ఇచ్చింది. నా చిన్ననాటి నుండి ఉన్న స్త్రీత్వపు ఆరాటానికి ఆ స్పర్శ ఒక అద్దం పట్టినట్టు అనిపించినా, శ్రావ్య ఏమనుకుంటుందో అనే భయంతో విక్రమ్‌ను గట్టిగా పక్కకి నెట్టేసాను.

విక్రమ్ ఆశ్చర్యపోతూ—"ఏమైంది బంగారం ఇవాళ నీకు? నా భార్యను నేను కౌగిలించుకుంటే అంతలా కంగారు పడుతున్నావ్?" అన్నాడు.

అతని మాటలు వినగానే నా ఒళ్లు ఒక్కసారిగా వణికిపోయింది. "నేను శ్రావ్యను కాదు..." అని చెప్పేలోపే, అటువైపు తిరిగి ఉన్న వ్యక్తి నా వైపు తిరిగాడు.

నా కళ్లని నేనే నమ్మలేకపోయాను. నా ఎదురుగా నిలబడింది... నేను! అవును, నా మగ శరీరం నా ఎదురుగా నిలబడి ఉంది. ఇదంతా ఏదో పీడకల అనుకుని కళ్లు గట్టిగా మూసి తెరిచాను. కానీ ఎదురుగా ఉన్న నిజం మారలేదు. పరుగున వెళ్లి అద్దంలో చూసుకున్నాను. అద్దంలో నా మగ రూపం లేదు... అచ్చం శ్రావ్య రూపం కనిపిస్తోంది!

నేను పడుతున్న కంగారును, నా వింత ప్రవర్తనను చూసి విక్రమ్ నా దగ్గరకు వచ్చాడు. "ఏం బంగారం, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు?" అని అడుగుతుంటే నాకు నోట మాట రాలేదు.

"నీ భార్య శరీరం లోపల ఉన్నది నేను... సుశాంత్‌ని!" అని చెబితే అసలు నమ్ముతాడా? నన్ను పిచ్చాసుపత్రిలో వేస్తారేమో అనే భయం వేసింది. ఏం చేయాలో తోచక మౌనంగా ఉండిపోయాను. విక్రమ్ నన్ను దగ్గరకు తీసుకుని సరసం ఆడుతుంటే, లోపల భయంతో వణుకుతూనే ఆ స్పర్శను అనుభవించాల్సి వచ్చింది.

శ్రావ్య శరీరంలో ఉన్న నా పొడవాటి జడ నా నడుముకు తగులుతుంటే నా చిన్ననాటి కోరిక తీరినట్టు అనిపించింది. నేను ఎప్పుడూ ఒక స్త్రీలా అలంకరించుకోవాలని, ఆ కోమలత్వాన్ని అనుభవించాలని అనుకున్నాను. కానీ, ఒక స్త్రీ సమాజంలో అనుభవించే అసలైన బంధనాలు, బాధ్యతల భారం ఎలా ఉంటుందో నాకు అప్పుడు కానీ అర్థం కాలేదు. ఇదంతా గమనిస్తున్న నా శరీరంలో ఉన్న శ్రావ్య, పెదవులపై ఒక గూఢమైన నవ్వుతో నన్నే చూస్తోంది.

"నేను వెళ్లొస్తానండి" అని నా పాత గొంతుతో (సుశాంత్ రూపంలో ఉన్న శ్రావ్య) చెప్పి, అక్కడ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఒక పురుషుడిగా ఆ సమాజంలోకి తను వేసే ప్రతి అడుగులోనూ స్వేచ్ఛను వెతుక్కుంటున్న ఆనందం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించింది.

ఆమె వెళ్లిన మరుక్షణమే విక్రమ్ పూర్తిగా రొమాంటిక్ మూడ్‌లోకి వచ్చేశాడు. నాకేమో చలిజ్వరం వచ్చినట్టు ఉంది. విక్రమ్ నా బుగ్గలు నిమురుతూ—"ఒక కప్పు కాఫీ తీసుకురావా బంగారం?" అన్నాడు.

నేను ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లాను. కాఫీ పొడి డబ్బా ఎక్కడుందో తెలియక వెతుకుతుంటే, నా చేతులు నా ప్రమేయం లేకుండానే అల్మారా పైభాగానికి వెళ్లాయి. శరీరం శ్రావ్యది కావడంతో, ఆమె అలవాట్లు ఆటోమేటిక్‌గా నా చేతులతో చేయిస్తున్నాయి.

నేను కాఫీ కలుపుతుండగా, విక్రమ్ వెనుక నుండి వచ్చి నన్ను గట్టిగా అల్లేసుకున్నాడు. "ఇన్నాళ్లకి మేడం గారు దొరికారు. ఈరోజు నిన్ను వదిలేదే లేదు. పెళ్లై రెండేళ్లు అవుతున్నా ఏదో వ్రతం అంటూ నన్ను ముట్టుకోనివ్వలేదు. ఈరోజుతో ఆ వ్రతం పూర్తయింది కదా" అంటూ నా మెడపై ముద్దులు కురిపించాడు.

నేను రాయిలా నిలబడిపోయాను. విక్రమ్ నన్ను తన వైపు తిప్పుకుని నా పెదవులపై గాఢమైన ముద్దు పెట్టాడు. నా జీవితంలో ఒకరు నన్ను ఇలా ముద్దాడటం ఇదే మొదటిసారి. నేను శ్రావ్య శరీరంలో ఉండటం వల్ల, అతని మగ బలాన్ని ఎదిరించి పక్కకు నెట్టేసే శారీరక శక్తి నాలో లేదు. తప్పనిసరి పరిస్థుతులలో విక్రమ్ కౌగిలిలో బంధింపబడ్డాను.

ఆ క్షణంలో నాకొక నిజాన్ని గ్రహించాను. ఒక స్త్రీ శరీరం ఎంత బలహీనమైనదో, పురుషాధిక్యత కలిగిన సమాజంలో ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఒక భర్తగా తన హక్కును ఎలా చలాయిస్తారో నాకు ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. నా మనసు ఎంత వద్దంటున్నా, శరీరం మాత్రం అతని స్పర్శకు లొంగిపోక తప్పని పరిస్థితి.

కొంతసేపటికి విక్రమ్‌కి ఆఫీస్ నుండి ఏదో అర్జెంట్ కాల్ రావడంతో అతను పక్క గదిలోకి వెళ్లాను. నేను ఒంటరిగా హాల్‌లో కూర్చుని ఏడ్చేశాను. "ఎందుకు ఇలా జరిగింది? శ్రావ్య నాకెందుకు ఈ ద్రోహం చేసింది?" అని ఆలోచిస్తుంటే నా మెదడు పగిలిపోయేలా అనిపించింది.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీస్తే నా శరీరంలో ఉన్న శ్రావ్య నిలబడి ఉంది. తను లోపలికి రాగానే, విక్రమ్ కూడా ఫోన్ మాట్లాడి బయటకు వచ్చాడు.

"ఏంటి సుశాంత్? ఇందాక సరిగ్గా మాట్లాడలేదు. ఏంటి ఇలా వచ్చావు?" అని అడిగాడు విక్రమ్.

"ఏం లేదండి.. ఊరికే వచ్చాను. రూమ్‌లో ఒక్కదాన్నే... ఐ మీన్, ఒక్కడినే ఉంటున్నాను కదా, కొంచెం బోర్ కొట్టి వచ్చాను" అంది శ్రావ్య నా గొంతుతో.

"ఏంటి సుశాంత్, ఒక్కదాన్నే అంటున్నావు? ఆడవాళ్లలా మాట్లాడుతున్నావు?" అని విక్రమ్ నవ్వుతూ అడుగుతుండటంతో నాకు భయం వేసింది. వెంటనే నేను మధ్యలో అందుకుని—"కొంచెం ఊరుకోండి ఏవండీ. సుశాంత్, కాఫీ తాగుతావా?" అని అడిగాను.

"హా.. తాగుతాను ఇవ్వండి" అంది శ్రావ్య.

నాకు టెన్షన్ పెరిగిపోతోంది. నేను కాఫీ తీసుకుని వచ్చేలోపే విక్రమ్‌కి మళ్లీ ఆఫీస్ కాల్ వచ్చింది. "సుశాంత్, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను" అని అతను గదిలోకి వెళ్లి తలుపు పెట్టేసుకున్నాడు.

విక్రమ్ వెళ్లగానే నేను శ్రావ్య మీద విరుచుకుపడ్డాను. "అసలు ఎందుకు చేశావు ఇదంతా? నా శరీరాన్ని నాకు ఇచ్చేయ్" అని బతిమిలాడాను.

అప్పుడు ఆమె నా వైపు చాలా తీవ్రంగా చూసింది. ఆ కళ్లలో నన్ను అడిగే హక్కు నాకున్నా, ఆమె చెప్పే సమాధానంలో ఒక తీరని ఆవేదన ఉంది.

"సుశాంత్! నువ్వు నన్ను చూసి కేవలం నా అందాన్ని, నా సంప్రదాయమైన చీరకట్టుని, నా మల్లెపూలని చూసి మురిసిపోయావు. కానీ ఈ అందమైన బంధనం వెనుక ఒక స్త్రీగా నేను ఎంత చచ్చి బతుకుతున్నానో నీకేం తెలుసు? నాకు చిన్నప్పటి నుండి ఒక డాక్టర్ అవ్వాలని కల. రాత్రింబవళ్లు చదివాను. కానీ ఈ సమాజం ఏం చెప్పింది? 'ఆడపిల్ల చదువుకుని ఏం చేస్తుంది? పెళ్లి చేసి ఒకడి చేతిలో పెడితే ఇల్లాలుగా ఇల్లు సర్దుకుంటే చాలు' అని నా రెక్కలు కత్తిరించారు. నా భర్తకు నా మనసులోని ఆశయం కంటే, వంటగదిలో నేను చేసే వంట, పడకగదిలో నేను ఇచ్చే సుఖం మాత్రమే కావాలి. ఇక్కడ శ్రావ్య అనే వ్యక్తిత్వానికి విలువ లేదు, కేవలం ఒక 'భార్య' అనే పాత్రకు మాత్రమే గుర్తింపు ఉంది."

ఆమె మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోయింది. ఆమె ఇంకాస్త ఆవేశంగా అంది:

"నువ్వు స్త్రీగా మారి అందంగా ముస్తాబు అవ్వాలని కోరుకున్నావు. నేనేమో ఒక పురుషుడిగా మారి నా సొంత కాళ్లపై నిలబడి, నా డాక్టర్ కలను నిజం చేసుకోవాలని, ఈ నాలుగు గోడల బంధీఖానా నుండి స్వేచ్ఛా వాయువులు పీల్చాలని కోరుకున్నాను. అందుకే నీ శరీరంలోకి నేను, నా శరీరంలోకి నిన్ను మార్చేశాను. ఇద్దరి కోరికలూ తీరాయి కదా!"

నేను షాక్‌లో ఉండిపోయాను. "ఇదంతా సరే.. కానీ ఈ మాయ ఎలా సాధ్యం?" అని అడిగాను.

"మా కుటుంబంలో కొందరికి పరకాయ ప్రవేశం వంటి సిద్ధులు ఉన్నాయి. వారి ద్వారానే నేను ఈ విద్య నేర్చుకున్నాను" అని శ్రావ్య చెప్తుండగానే, ఇంటి బయట కారు ఆగింది.

తలుపు తీసి చూస్తే విక్రమ్ తల్లిదండ్రులు (నా అత్తమామలు) వచ్చారు. నేను వారిని చూడటం ఇదే మొదటిసారి. కానీ శ్రావ్య జ్ఞాపకాల వల్ల నా నోటి నుండి అప్రయత్నంగా—"రండి అత్తయ్య, కూర్చోండి మామయ్య" అనే మాటలు వచ్చాయి. విక్రమ్‌ని కూడా లోపలి నుండి పిలిచాను. ఇంతలో నా రూపంలో ఉన్న శ్రావ్య—"నాకు కొంచెం పని ఉంది, వెళ్లొస్తాను" అని చెప్పి అక్కడి నుండి జారుకుంది. ఆ సమాజపు కట్టుబాట్లను నా తలపై పడేసి తను ఒక పక్షిలా ఎగిరిపోయింది.

కానీ, వాళ్లు ఎందుకు వచ్చారో తెలిసాక నా గుండె ఆగినంత పనైంది. శ్రావ్య చేసిన నోము వ్రతం పూర్తయింది కాబట్టి, ఈరోజే మా శోభనానికి ముహూర్తం నిశ్చయించి వచ్చారు! ఒక స్త్రీ శరీరం కేవలం వంశాన్ని ఉద్ధరించడానికి, ఒక పురుషుడి శారీరక అవసరాన్ని తీర్చడానికే అన్నట్టుగా ఆ ముహూర్తాలు, ఏర్పాట్లు సాగిపోతున్నాయి.

వాళ్లు రావడం రావడమే నన్ను చూసి—"అమ్మా శ్రావ్యా, రాత్రికి ముహూర్తం ఉంది కదా.. కొంచెం షాపింగ్‌కి వెళ్లాలి, రెడీ అవ్వు" అన్నారు. నాకు మొదట విపరీతమైన భయం వేసింది, ఆ తర్వాత ఒక పురుషుడిగా సిగ్గు అనిపించింది. కానీ నేను పరాయి స్త్రీ శరీరంలో ఉంటూ, ఆమె భర్తతో శోభనంలో పాల్గొనడం ఘోరమైన ద్రోహం అవుతుంది. శ్రావ్య ఈ బంధాల నుండి తప్పించుకోవడానికే నన్ను ఇక్కడ ఇరికించిందా అనిపించింది.

వెంటనే నేను విక్రమ్ దగ్గరకు వెళ్లి—"ఏవండీ, అత్తయ్య ఈరోజే శోభనం అంటున్నారు. నాకు ఇప్పుడు వద్దు, నేను మానసికంగా సిద్ధంగా లేను" అని చెప్పాను. కానీ ఒక స్త్రీ తన మానసిక స్థితిని చెబితే ఈ సమాజం వినదు కదా! ఈ మాటలు విన్న అత్తగారికి కోపం వచ్చింది. ఆమె మామయ్య దగ్గరకు వెళ్లి—"చూశారా అండీ, ఈ కాలం పిల్లలకి అస్సలు మర్యాద లేదు. మేము ఇంత దూరం నుండి వస్తే కనీసం నా మాట కూడా వినడం లేదు. మొగుడికి సుఖం పెట్టడం కంటే ఈమెకు ఏముంది ఎక్కువ పని?" అని ఒక స్త్రీ అయ్యుండి కూడా మరో స్త్రీ మనోభావాలను తక్కువ చేస్తూ మాట్లాడటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వృద్ధుల బాధ చూడలేక, తప్పనిసరి పరిస్థుతులలో "సరే అత్తయ్య, మీ ఇష్టం" అనాల్సి వచ్చింది.

ఈ విషయం ఎలాగైనా శ్రావ్యకు చెప్పి ఈ ముప్పు నుండి తప్పించుకుందామని పక్క ఫ్లాట్‌కి వెళ్లాను. కానీ అక్కడ డోర్ లాక్ చేసి ఉంది. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. ఒక మగవాడిగా నాకున్న స్వేచ్ఛను ఉపయోగించి ఆమె ఎక్కడికైనా వెళ్లగలదు, కానీ ఒక స్త్రీగా నేను ఈ ఇంటి నాలుగు గోడల మధ్య బందీనైపోయాను.

కొంతసేపటికి అందరం కలిసి షాపింగ్‌కి వెళ్లాము. అక్కడ నా కోసం తెల్లటి పట్టుచీర, దానికి మ్యాచింగ్ నగలు, పండ్లు, స్వీట్లు అన్నీ కొన్నారు. ఇంటికి వచ్చాక అత్తయ్య నన్ను బలవంతంగా స్నానానికి తీసుకెళ్లింది. శరీరం శ్రావ్యదే అయినా, లోపల ఉన్న ఆత్మ నాది (సుశాంత్‌ది) కావడంతో తల తీసేసినట్టు అనిపించింది. ఒక పెళ్లికూతురిని శోభనానికి సిద్ధం చేసేటప్పుడు ఆమెను ఒక మనిషిలా కాకుండా, కేవలం ఒక వస్తువులా అలంకరించే ఆ పద్ధతి నన్ను కలచివేసింది. ఒంటికి పసుపు రాసి, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి, ఆ తెల్లటి చీర కట్టి, తల నిండా మల్లెపూలు పెట్టి, చేతిలో పాల గ్లాసు ఇచ్చి విక్రమ్ ఉన్న గదిలోకి నన్ను నెట్టేసి తలుపు గడియ పెట్టేశారు.

నాకు ఇదంతా ఒక కొత్త లోకంలా ఉంది. కానీ నా మనస్సాక్షి నన్ను నిలదీస్తోంది. శ్రావ్య శరీరంలో ఉంటూ విక్రమ్‌ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు.

గదిలోకి రాగానే విక్రమ్ పూర్తిగా ఫస్ట్ నైట్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. నా చేతిలో ఉన్న పాల గ్లాసు తీసుకుని పక్కన పెట్టి, నన్ను మాటల్లో దించుతూ నా చీర కొంగును విప్పడం మొదలుపెట్టాడు. నేను భయంతో అతని నుండి తప్పించుకోవడానికి గదిలోనే ఇటు అటు పరుగెత్తడం ప్రారంభించాను.

"వద్దు విక్రమ్.. నన్ను తాకకు.. నేను శ్రావ్యను కాదు, సుశాంత్‌ని!" అని గట్టిగా అరవాలనిపించింది. కానీ నా గొంతు పెగలడం లేదు. ఒక స్త్రీ 'వద్దు' అని చెప్తున్నా వినకుండా, అది కేవలం ఆమె సిగ్గు అనుకుంటూ బలవంతం చేసే మగ బుద్ధిని చూసి నాకు రోత పుట్టింది. ఎంత పరుగెత్తినా ఆ చిన్న గదిలో ఎటు వెళ్లను? బాగా అలసిపోయాను. విక్రమ్ తన షర్ట్ విప్పేసి, నన్ను మంచంపైకి నెట్టి నాపైకి వచ్చాడు.

ఇక చేసేదేమీ లేక, ఆఖరి ప్రయత్నంగా ఒక స్త్రీకి మాత్రమే ఉండే ప్రకృతి సహజమైన ఆయుధాన్ని వాడాను—"ఏవండీ.. నాకు ఈరోజే Ladies Problem వచ్చింది" అని అబద్ధం చెప్పేసాను!

ఆ మాట వినగానే విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని మూడ్ అంతా పాడైపోయింది. అలా ఒక స్త్రీ శరీరం ఎదుర్కొనే ఆ నెలసరి సమస్యే, ఈరోజు నన్ను ఒక పరాయి మగవాడి నుండి కాపాడింది. ఆ ఒక్క అబద్ధంతో, కనీసం ఒక మూడు రోజుల వరకు ఆ శోభన కార్యక్రమాన్ని ఆపగలిగాను. నన్ను నేను కాపాడుకున్నాను.

కానీ, ఈ మూడు రోజులు గడిచాక నా పరిస్థితి ఏంటి? నా మగ శరీరంలో స్వేచ్ఛగా తిరుగుతున్న శ్రావ్య, తిరిగి ఈ బంధనాల వలయంలోకి వస్తుందా? లేక నేను ఇలాగే ఒకరి భార్యగా జీవితాంతం ఉండిపోవాలా?

Comments

Popular posts from this blog

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్

మనసుకు నచ్చే స్టోరీస్ లింక్స్  https://anthascd.blogspot.com/ https://malligacd.blogspot.com/?m=1    tamil https://crossdressingfantasystories.wordpress.com https://www.deviantart.com/cd-tg-stories https://anandhiurl.blogspot.com/         

My Life- My Wife!!

నా  భార్య  నా జీవితం    పార్ట్ 1    హలో ఫ్రెండ్స్ , నా పేరు గౌరీ శంకర్ , నాది వైజాగ్ . ప్రస్తుతానికి నేన్ను బెంగళూరు లో ఉంటునాన్ను. నా పెళ్ళాం నన్ను తన్న పెళ్ళాంగా ఎలా మారుచుకుందో చెపుతాను . నా పేరు గౌరీ, గౌరీ శంకర్, నా పుట్టుక, నా చదువు అంత వైజాగ్ లోనే, నా బి.టెక్ అయ్యాక మా ఇంటిలో నాకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు, తన్న పేరు స్వపన్న , తన్నది కూడా అపుడే మెడికల్ కంప్లీట్ చేసింది. మా పెళ్ళి జరిగే సమయానికి తన్నకి తల్లి, తండ్రి చనిపోయారు, తాను వాళ్ళ పిన్ని , బాబాయ్ దగ్గర ఉండేది, కానీ తన్న పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా సంపాదించారు. ఎంత అంతే సుమారు 500 cr  దాక. నా పేరెంట్స్ కి వాళ్ళ పిన్ని,బాబాయ్ లు తెలిసినవాళ్ళు కావడం తో , మా  పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగేక మేము ఇద్దరమూ బెంగుళూరు కి  షిఫ్ట్ అయ్యాము, నాది ఇంజనీరింగ్ కదా అక్కడే ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ వచ్చింది, నాకు మంత్లీ 1 lakh శాలరీ , తన్ను కూడా అక్క ఒక్క ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది, తన్నది కూడా approx మంత్లీ 1 lakh శాలరీ. తన్ను మెడిసిన్ చేసింది అన్ని చెప్పాను కదా...

Birthday Gift

 Birthday Gift  Part 1 :   Angry Sister  But Dad!” “I am sorry sweetheart. But I am stuck until the end of this lockdown. There are no means available for me to travel.” That was my sister Neha and my father talking. My sister was upset because our father couldn’t be there for her birthday next week. He had been stuck in Chennai for more than a month now since the lockdown began. In all these years, he had always ensured that he was not on his business trips so that he could be there for his children’s birthdays. But not this time. My sister Neha is usually a chirpy bubbly kind of girl, but she can get emotional too. She is affectionate and caring. I, on the other hand, couldn’t care less about others. I am more like a prankster and a little selfish about my approach. To tell you more about my family, we live in Goa. My sister is 23 and is working as an HR manager for a multinational company. I am 21, an engineering college student in the final year. My mother r...